ఆదిలాబాద్ టౌన్, వెలుగు: జిల్లాలోని అన్ని గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో అంగన్వాడీ భవనాలు నిర్మిస్తామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. బేల మండలంలోని సిర్సన్న గ్రామంలో రూ.12 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించనున్న అంగన్వాడీ భవన నిర్మాణానికి ఆదివారం ఆయన భూమి పూజ చేశారు. రైతులు తమ పంట క్షేత్రాలకు వెళ్లడానికి రోడ్లు నిర్మిస్తామని తెలిపారు.
అంతకుముందు రిమ్స్‌లో శ్రీరామ్‌సేన ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆస్పత్రి డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్‌తో కలిసి ప్రారంభించారు. 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని సూచించారు. నాయకులు ఆదిత్య ఖండేష్కర్, ఎం.అశోక్, రాందాస్, అశోక్ రెడ్డి, నవీన్, నందు, రాము తదితరులు పాల్గొన్నారు.