పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలి : ​పాయల్ ​శంకర్​

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో​బీజేపీ నాయకులు, కార్యకర్తలు పార్టీ జెండాను ఎగురవేశారని, పార్లమెంట్​ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు సిద్ధం కావాలని ఆ పార్టీ పార్లమెంట్​ఇన్​చార్జి, ఎమ్మెల్యే పాయల్​శంకర్ కోరారు. ఆదిలాబాద్​పట్టణంలోని ఎస్టీయూ భవన్​లో ఆయన ఆధ్వర్యంలో మంగళవారం బీజేపీ పార్లమెంట్ కోర్ కమిటీ సమావేశం నిర్వహించి మాట్లాడారు.

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలపర్చాలని పిలుపునిచ్చారు.  పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్​ టికెట్ ఎవరికి వచ్చినా నాయకులు, కార్యకర్తలు పూర్తిస్థాయిలో పనిచేయాలన్నారు. పార్టీ రాష్ట్ర నాయకుడు లక్ష్మీనారాయణతోపాటు ఎంపీ సోయం బాపూరావు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పార్టీ ఎమ్మెల్యేలు మహేశ్వర్​రెడ్డి, రామారావు పటేల్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్​ బాపూరావు, మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ పాల్గొన్నారు.