ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : పాయం వెంకటేశ్వర్లు

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : పాయం వెంకటేశ్వర్లు
  • ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

బూర్గంపహాడ్, వెలుగు : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, దశలవారీగా అర్హులందరికీ పథకాలు అందుతాయని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం తహసీల్దార్ కార్యాలయంలో రూ.16.75లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో రైతులకు సముచిత ప్రాధాన్యం ఉంటుందన్నారు. 

కాంగ్రెస్ ఏర్పడిన ఏడాది కాలంలో మహిళలకు పెద్దపీట వేసిందని చెప్పారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అనంతరం బూర్గంపహాడ్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన యూసఫ్ క్రికెట్ కప్ విజేతలకు బహుమతులను అందచేశారు.  ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.