- గ్రామస్తులను అభినందించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
పినపాక, వెలుగు : పినపాక మండలం జానంపేట గ్రామంలో గ్రామస్తుల సహకారంతో నిర్మించిన బస్టాండ్‌ను గురువారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికుల అవసరాల కోసం గ్రామస్తులు చందాలు వేసుకుని సుమారు రూ.3లక్షలతో బస్టాండ్‌ను నిర్మించడం అభినందనీయమన్నారు. బస్టాండ్ నిర్మాణం కోసం కృషి చేసిన పలువురిని ఆయన అభినందినంచారు.
అనంతరం పలువురు ఎమ్మెల్యేను ఘనంగా శాలువాలతో సత్కరించారు. జానంపేట, ఏడూళ్ళబయ్యారం గ్రామాల్లో ఇటీవల చనిపోయిన కాంగ్రెస్ కార్యకర్తల కుటుంబాలను పాయం వెంకటేశ్వర్లు పరామర్శించారు. కార్యక్రమంలో తహసీల్దారు నరేశ్, ఎంపీడీవో రామకృష్ణ, ఎస్ఐ రాజ్‌కుమార్, కాంగ్రెస్ నాయకులు పి.వెంకటేశ్వర్లు, కంది సుబ్చారెడ్డి, గంగిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.