కరకగూడెం, వెలుగు : ప్రతి పల్లె అభివృద్ధికి కృషి చేస్తున్నానని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. మండలంలోని వెంకటాపురంలో రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ బిల్డింగ్ ను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలను సమగ్ర అభివృద్ది కోసం అహర్నిశలు పని చేస్తానని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో నిరుపేద గిరిజనులకు రూ.6 లక్షలతో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు
మణుగూరు : ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇంటి పథకం ద్వారా శాశ్వత గృహ నిర్మాణం చేసి ఇస్తామని ఎమ్మెల్యే పాయం తెలిపారు. మణుగూరు లోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఇందిరమ్మ మోడల్ హౌస్ కు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. నియోజకవర్గానికి 3, 500 ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా మంత్రి పొంగులేటి చొరవతో మరో వెయ్యి అదనంగా మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు.