గ్రామీణ క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదగాలి : పాయం వెంకటేశ్వర్లు

  • ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

బూర్గంపహాడ్, వెలుగు : గ్రామీణ క్రీడాకారులు జాతీయస్థాయికి ఎదగాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. మండల కేంద్రమైన బూర్గంపహాడ్ లో నిర్వహిస్తున్న 17వ యూసఫ్ మెమోరియల్ కప్  జిల్లాస్థాయి క్రికెట్ పోటీలను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రమాదంలో మృతి చెందిన స్నేహితుడి జ్ఞాపకార్థం 17 సంవత్సరాలుగా క్రికెట్ పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు. పోటీలలో పాల్గొంటున్న క్రీడాకారులు స్నేహపూర్వకంగా ఉంటూ గెలుపోటములను సమానంగా స్వీకరించాలని సూచించారు. 

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దుగ్గెంపూడి కృష్ణారెడ్డి, ఐఎన్టీయూసీ నాయకులు మారం వెంకటేశ్వర రెడ్ది, కాంగ్రెస్ నాయకులు పోతిరెడ్డి వెంకటేశ్వర రెడ్ది, బర్ల నాగమణి,  మందా నాగరాజు, భజన సతీశ్, కైపు శ్రీనివాసరెడ్ది, కిషోర్ నాయక్, బెల్లంకొండ రామారావు, వాసుదేవరావు, నిర్వాహుకులు భజన ప్రసాద్, సోహైల్ పాషా, శనగా కిషోర్ తదితరులు పాల్గొన్నారు.