యాదాద్రి, వెలుగు: ప్రజలంతా బీఆర్ఎస్ వెంటే ఉన్నారని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి తెలిపారు. బుధవారం పోచంపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధే ఎజెండాగా పని చేస్తున్న తనకు ఓటేసి గెలిపించాలని కోరారు.
రానున్న రోజుల్లో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు. కాగా భువనగిరి మండలం హన్మాపురంలో పైళ్ల భార్య వనిత , భువనగిరి మున్సిపాలిటీలో ఆయన కూతురు మాన్విత ప్రచారం నిర్వహించారు.
ALS0 READ: పార్టీలకు అతీతంగా పథకాలిచ్చాం.. గెలిపించాలి: రేగా కాంతారావు