హార్టికల్చర్‌‌ రీసెర్చ్‌‌ సెంటర్‌‌కు భూమిపూజ : పెద్ది సుదర్శన్‌‌రెడ్డి

నల్లబెల్లి, వెలుగు : రైతు సంక్షేమానికి బీఆర్ఎస్‌‌ ప్రభుత్వం కృషి చేస్తోందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌‌రెడ్డి చెప్పారు. వరంగల్‌‌ జిల్లా నల్లబెల్లి మండలం కన్నారావుపేట సమీపంలో రూ. 48 కోట్లతో నిర్మించనున్న హార్టికల్చర్‌‌ రీసెర్చ్‌‌ సెంటర్‌‌కు డీసీసీబీ చైర్మన్‌‌ మార్నేని రవీందర్‌‌రావు, కలెక్టర్‌‌ ప్రావీణ్యతో కలిసి శుక్రవారం భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్‌‌రెడ్డి మాట్లాడుతూ హార్టికల్చర్‌‌ పరిశోధన కేంద్రంతో ఈ ప్రాంత రైతులకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. అలాగే నల్లబెల్లిలో డీసీసీ బ్యాంక్‌‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో ఏడీఏ శ్రీనివాసనావు, జడ్పీ ఫ్లోర్‌‌ లీడర్‌‌ స్వప్న, రామస్వామి, ఎంపీపీ సునీతా ప్రవీణ్‌‌, సర్పంచ్‌‌ నిర్మల, మురళీధర్, సారంగపాణి పాల్గొన్నారు.