ఆటల్లో నర్సంపేటకు పేరు తేవాలి : పెద్ది సుదర్శన్‌‌‌‌రెడ్డి

నర్సంపేట, వెలుగు : ఆటల్లో నర్సంపేటకు మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌‌‌‌రెడ్డి పిలుపునిచ్చారు. నర్సంపేట జోన్‌‌‌‌ అండర్‌‌‌‌ 14, 17 కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌‌‌‌ పోటీలను శుక్రవారం స్థానిక మినీ స్టేడియంలో ఎమ్మెల్యే ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టూడెంట్లు చదువుతో పాటు ఆటపాటల్లోనూ రాణించాలని సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌‌‌‌ జుర్రు రాజు, ఎర్ర జగన్మోహన్‌‌‌‌రెడ్డి, డాక్టర్‌‌‌‌ పుల్లూరి శ్రీనివాస్‌‌‌‌గౌడ్‌‌‌‌, కమలాకర్‌‌‌‌ పాల్గొన్నారు.