తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. తనకు కేటాయించిన సెక్యూరిటీతో ఫొటో షూట్ చేయటం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. తన గన్‌మెన్‌లు, వై.సెక్యురిటీ సిబ్బందితో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చేసిన వీడియో షూట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
KGF లెవల్లో క్రేజీ షూట్..
16 సెకన్ల వీడియోలో ముందుగా రోహిత్ రెడ్డి కాషాయ వస్త్రాలు ధరించి నడుచుకుంటూ వస్తుండగా..వెంటనే ఆయన వెనక నుంచి సెక్యూరిటీ సిబ్బంది ఒక్కొక్కరుగా బయటకు వస్తుంటారు. బ్యాగ్రౌండ్ లో మ్యూజిక్ ప్లే అవుతుండగా...రెండు వైపులా సెక్యూరిటీ సిబ్బంది నడుస్తండగా..మధ్యలో రోహిత్ రెడ్డి నడుచుంటూ వస్తుంటారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఓవరాక్షన్ కాకపోతే ఏంది ఇది..?
ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వీడియోపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజాప్రతినిధుల భద్రత కోసం సెక్యూరిటీ కేటాయిస్తే.....వారిని ఇలా ఫొటోషూట్ కోసం వాడుకుంటరా అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం కల్పించిన భధ్రత సిబ్బందితో వీడియో ఫోటో షూట్స్ చేయడం ఏమిటంటూ.. ఎమ్మెల్యే ఓవరాక్షన్‌కు ఈ చర్య నిదర్శనమని మండిపడుతున్నారు.
2018 ఎన్నికల్లో పైలట్ రోహిత్ రెడ్డి తాండూరు నుంచి కాంగ్రెస్ తరపున గెలిచారు. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్ లో చేరారు. 2022లో రాష్ట్రంలో సంచనలం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రోహిత్ రెడ్డి ఫిర్యాదుదారుడిగా కూడా ఉన్నారు. ఈ కేసులో పైలట్ రోహిత్ రెడ్డి కీలకంగా మారడంతో.. రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు వై కేటగిరి సెక్యూరిటీని కల్పించింది.
ప్రభుత్వ పోలీసు సెక్యూరిటీతో వీడియోలు రూపొందించిన రోహిత్ రెడ్డి..రోహిత్ రెడ్డి సెక్యూరిటీ, భద్రత, కాన్వాయ్ వీడియోల పై విమర్శలు..రోహిత్ రెడ్డికి ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో భద్రత పెంచిన రాష్ట్ర ప్రభుత్వం. pic.twitter.com/T7xBLAgvRr
— HEMA (@Hema_Journo) July 13, 2023