
తాండూరు బీఆర్ఎస్ అభ్యర్థిగా తనను ఖరారు చేసినందుకు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి. తాండూరు ప్రజలకు మరోసారి సేవ చేసే అవకాశం కల్పించారని చెప్పారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డితో కలిసి పని చేస్తానన్నారు. తొమ్మిదేళ్లలో తాండూరు నియోజకవర్గం చాలా అభివృద్ధి చెందిందన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైలెట్..మహేందర్ రెడ్డి ఆశీర్వాదం తీసుకున్నారు. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి రాజకీయ అనుభవంతో కలిసి ముందుకు వెళ్తానని చెప్పారు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి. తాండూరును ఇంకా అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామన్నారు. పట్నం మహేందర్ రెడ్డికి సీఎం కేసీఆర్ సముచిత స్థానం కల్పిస్తారని ఆశిస్తున్నానని చెప్పారు.