హైదరాబాద్, వెలుగు: మాజీ మంత్రి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం సలహాదారుగా నియమించింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండటంతో ఆయనను వ్యవసాయ శాఖకు ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. కేబినేట్ హోదాతో అడ్వయిజరీ పోస్టును కల్పించింది.
ఇక .. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డికి కూడా ప్రభుత్వం నామినేటేడ్ పోస్టును ఇచ్చింది. తెలంగాణ డెయిరీ డెవలప్మెంట్కో ఆపరేటివ్చైర్మన్గా గుత్తా అమిత్ రెడ్డిని నియమిస్తూ సీఎస్ ఉత్తర్వులు ఇచ్చారు. చార్జ్ తీసుకున్న నాటి నుంచి రెండేళ్ల పాటు ఆయన ఈ పోస్టులో కొనసాగనున్నారు.