బాన్సువాడ రూరల్, వెలుగు: తాను కాంగ్రెస్ లో చేరినప్పుడు బాన్సువాడ నియోజకవర్గం కోసం ఏం కావాలన్నా ఇస్తానని సీఎం మాటిచ్చారని, తన ప్రాణం ఉన్నంత వరకు నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం బాన్సువాడలో కొత్తగా నిర్మించిన ఎక్సైజ్ కార్యాలయం ప్రారంభించారు. అనంతరం అమృత్ 2.0 లో భాగంగా బాన్సువాడ పట్టణానికి తాగునీరు సరఫరా చేసే పనులకు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ సురేశ్ షెట్కార్, ఆగ్రో చైర్మన్ కాసుల బాల్‌రాజ్‌తో కలిసి శంకు స్థాపన చేశారు.
అనంతరం మంత్రి, ఎంపీలతో కలిసి పోచారం జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కొత్త ప్రభుత్వం బ్రహ్మాండంగా పని చేస్తుందన్నారు. బాన్సువాడ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో జుక్కల్ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ రావు, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, పోచారం సురేందర్ రెడ్డి, కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్రు, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, బాన్సువాడ పట్టణ మున్సిపల్ చైర్మన్ గంగాధర్, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.