అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు : పోచారం శ్రీనివాస్​రెడ్డి

అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు : పోచారం శ్రీనివాస్​రెడ్డి

బాన్సువాడ, వెలుగు: బాన్సువాడ మండలం నాగారం గ్రామంలో  ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి భూమి పూజ చేశారు. అర్హులందరికీ ఇండ్లు ఇస్తామన్నారు.  నాగారం గ్రామంలో 79 మందికి ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. 

విడతల వారీగా రూ. 5 లక్షలు లబ్ధిదారులకు అందుతాయన్నారు.  కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, అధికారులు, బాన్సువాడ మండల  ప్రజాప్రతినిధులు అంజిరెడ్డి, మోహన్ నాయక్, రాచప్ప, నార్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు.