- బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
బాన్సువాడ, వెలుగు : నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను పార్టీ మారానని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడలో ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ.. తాను మంత్రిపదవి కోసం చేరారని అందరూ అనుకుంటున్నారని కానీ అది నిజం కాదన్నారు. కేవలం బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి తన ఆశయన్నారు. బాన్సువాడ సెగ్మెంట్ లో 20 ఏళ్లుగా కాసుల బాల్ రాజ్ కాంగ్రెస్ జెండా మోశాడని అలాంటి వ్యక్తికి కార్పొరేషన్ చైర్మన్ పదవి వస్తే సంతోషించాలని అడ్డుకోకూడదని సూచించారు.
పోచారం శ్రీనివాస్ రెడ్డి రాకతో కాంగ్రెస్ పార్టీ బాన్సువాడలో బలంగా తయారైందని నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు కాసుల బాల్ రాజ్ అన్నారు. పోచారంతో ఆయన కొడుకుతో కలిసి పని చేయడంతో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. కార్యక్రమంలో కాలిక్, శేఖర్ గౌడ్, అలీబీన్ అబ్దుల్లా, అప్రోజ్, పోచారం సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.