- మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్
శంషాబాద్, వెలుగు:శంషాబాద్–షాబాద్రోడ్డును నాలుగు లేన్లుగా మార్చేందుకు రూ.50కోట్లు కేటాయించాలని రాజేంద్రనగర్ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్కోరారు. శుక్రవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆయన నివాసంలో కలిసి విజ్ఞప్తి చేశారు.
రాజేంద్ర నగర్, చేవెళ్ల నియోజకవర్గాలను కలిపే రోడ్డు చిన్నగా ఉండడంతో ప్రమాదాలు పెరిగాయని చెప్పారు. అలాగే గండిపేట నుంచి శంకర్పల్లి రోడ్డును ఆరు లేన్లుగా పెంచేందుకు రూ.20 కోట్ల కేటాయించాలని కోరారు.