
కల్లు తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటూ అవగాహన కల్పిస్తున్న బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు. తాటి కల్లు, ఈత కల్లు..ఏదైనా శరీరానికి ఆరోగ్యం అని చెప్తున్నారు. తాజాగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కూడా కల్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు.
శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో గణేష్ గౌడ్ అనే గీత కార్మికుడు ఈత వనాన్ని పెంచాడు. ఈ ఈత వనాన్ని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఈత కల్లు టేస్ట్ చేశారు. అయితే కల్లు టేస్ట్ అదరడంతో మరింత తాగారు. అనంతరం 8 ఏళ్ల పాటు శ్రమించి ఈత వనాన్ని పెంచిన గణేష్ గౌడ్ దంపతులను ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అభినందించారు.
ఈత కల్లు, తాటికల్లులో ఔషధ గుణాలున్నాయని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. వీటిని పెంచడం వల్ల గీత కార్మికులకు ఉపాధి లభించి..వారి తలరాతలు మారతాయన్నారు. అటు ఈత, తాటి చెట్ల పెంపకంలో ప్రభుత్వం సహకారం అందిస్తోందని చెప్పారు.