ముస్లింలకు ఇఫ్తార్ విందు

కోల్ బెల్ట్, వెలుగు : మంచిర్యాలలోని ఎఫ్​సీఐ ఫంక్షన్ హాల్ లో ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేతో పాటు పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ హాజరయ్యారు. ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.