- ముల్కల్ల గోదావరిలో ఇసుక రీచ్ ప్రారంభించిన ఎమ్మెల్యే
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల మెడికల్ కాలేజీ ఆవరణలో రూ.23.75 కోట్లతో క్రిటికల్ కేర్ సెంటర్, సాయికుంటలో రూ.40 కోట్లతో నర్సింగ్ కాలేజీ నిర్మాణాలకు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు శనివారం శంకుస్థాపన చేశారు. ఈ నెల 21న మంత్రులు దామోదర రాజనర్సింహా, దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజరై పనులను ప్రారంభిస్తారని తెలిపారు. రెండున్నరేండ్లలో నిర్మాణం పూర్తిచేస్తామన్నారు. క్రిటికల్ కేర్ సెంటర్‌ఏర్పాటుతో జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందన్నారు. 50 బెడ్స్ కెపాసిటీతో ఎమర్జెన్సీ కేసులకు ఇక్కడ ట్రీట్మెంట్చేస్తారని చెప్పారు. అలాగే ముల్కల్ల గోదావరిలో ఇసుక రీచ్ ను ప్రారంభించారు.
నాణ్యమైన భోజనం అందించాలి
సాయికుంటలోని గిరిజన బాలిక ఆశ్రమ స్కూల్‌ను ఎమ్మెల్యే సందర్శించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అధికారులను ఆదేశించారు. రూ.50వేల విలువైన వస్తువులు, ప్లేట్లు, గ్లాసులు, గిన్నెలు అందజేశారు. అనంతరం గోదావరి తీరంలో జరుగుతున్న వైకుంఠధామం నిర్మాణ పనులను పరిశీలించారు.