
మంచిర్యాల జిల్లా హజీపూర్ మండలంలోని ర్యాలీగడ్పూర్ ఏసీసీ క్వారీ దుర్గమాత అమ్మవారి జాతరలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. నియోజకవర్గ ప్రజలందరికి జాతర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటుగా డీసీసీ అధ్యక్షురాలు సురేఖ ఇతర కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.