పార్టీకోసం కష్టపడ్డందుకు గుర్తింపు దక్కింది: ఎమ్మెల్సీ అభ్యర్థి అద్దంకి దయాకర్

పార్టీకోసం కష్టపడ్డందుకు గుర్తింపు దక్కింది: ఎమ్మెల్సీ అభ్యర్థి అద్దంకి దయాకర్

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకోసం తాను కష్టపడి పనిచేసినందుకు సరియైన గుర్తింపు లభించిందని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థి అద్దంకి దయాకర్ అన్నారు. ఆది వారం (మార్చి 9) కాంగ్రెస్ ఎమ్మెల్యే కోటా ఎమ్సెల్సీ అభ్యర్థులను ప్రకటించింది..ఈ లిస్టులో మొదటి ప్రియారిటీ అద్దంకి దయాకర్ కు దక్కింది. 

ఈ సందర్భంగా దయాకర్ మాట్లాడుతూ.. చాలా రోజులుగా వెయిట్ చేశారు. ఈ రోజు నన్ను పార్టీ గుర్తించడం చాలా సంతోషంగా ఉంది.  పార్టీకోసం పనిచేసే వారికి పదవులు అని చెప్పిన కాంగ్రెస్ కొత్త ఇంచార్జీ మీనాక్షీ  నటరాజన్ చెప్పడంతో  ఈలిస్టులో తన పేరు వస్తుందని ఊహించినట్లు అద్దంకి దయాకర్ చెప్పారు. AICC ఏ పదవి ఇచ్చినా బాధ్యత సక్రమంగా నిర్వహిస్తానని అన్నారు. 

ALSO READ | కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ప్రకటన.. అనుహ్యంగా రేసులోకి రాములమ్మ

గ్రామీణ స్థాయిలో కార్యకర్తలు కచ్చితంగా బాధ్యతగా పనిచేయాలి. అలా చేసిన వారిని పార్టీ కచ్చితంగా గుర్తింపు ఉంటుంది.. నాకు రిజర్వేషన్ ప్రాతిపదికన నన్ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించలేదని అనుకుంటున్నాను.. పార్టీ కోసం కష్టపడ్డ కాబట్టి ఈ ప్రకటన చేశారని అద్దంకి దయాకర్ అన్నారు.