హైదరాబాద్, వెలుగు: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఐపీఎస్ పీవీ.సునీల్ కుమార్‌పై కేసు నమోదయ్యింది. గుంటూరులో తనను కస్టడీకి తీసుకున్న టైమ్‌లో హత్యాయత్నం చేశారని ఉండి టీడీపీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ రఘురామ కృష్ణరాజు నగరపాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సెక్షన్ 120బి, 166, 167, 197, 307, 326, 465, 508 (34) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
2021, మే 14న తనపై హత్యాయత్నం చేశారని రఘురామ కృష్ణరాజు ఆ ఫిర్యాదులో వెల్లడించారు. ఈ కేసులో మాజీ సీఎం జగన్‌ను ఏ3గా పోలీసులు పేర్కొన్నారు. ఏ1గా సీఐడీ మాజీ డీజీ సునీల్ కుమార్, ఏ2గా ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ సీతారామాంజనేయులు, ఏ4 విజయపాల్, ఏ5గా డాక్టర్ ప్రభావతిలను చేర్చారు.