కూల్చిన శ్మశాన వాటికను పునర్నిర్మించాలి

  • తుక్కాపూర్ లో గ్రామస్తులతో కలెక్టర్ ను కలిసిన దుబ్బాక ఎమ్మెల్యే 

సిద్దిపేట రూరల్, వెలుగు : తొగుట మండలం తుక్కాపూర్ లో కూల్చివేసిన డంపింగ్ యార్డ్, శ్మశాన వాటికను పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తూ గురువారం గ్రామస్తులతో కలిసి ఎమ్మెల్యే రఘునందన్ రావు సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు రోజుల కింద అర్ధరాత్రి శ్మశానవాటికను, డంపింగ్​ యార్డ్​ను కొంతమంది వ్యక్తులు కూలగొట్టారని తెలిపారు. ఈ విషయంపై కలెక్టర్ స్పందిస్తూ కొత్త స్థలం చూసి శ్మశానవాటిక, డంపుయార్డు నిర్మాణాన్ని చేపడతామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే చెప్పారు. మల్లన్న సాగర్ లో నీటిమట్టం ఎక్కువ అయినప్పుడు నీటి ఊటలు వస్తూ గ్రామంలోని టాయిలెట్స్, వాష్ రూమ్స్ నల్లాల నుంచి నీళ్లు పైకి వస్తున్నాయని, దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కలెక్టర్​ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. పదిరోజుల్లో సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్​ హామీ ఇచ్చారని ఆయన చెప్పారు. 

పోచమ్మ ఉత్సవాల్లో ఎమ్మెల్యే 

దుబ్బాక, వెలుగు: అక్భర్​పేట–భూంపల్లి మండలం బొప్పాపూర్​ గ్రామంలో గురువారం పోచమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యేను నిరవాహకులు శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ దేవతలను పూజించడం మన సంప్రదాయమని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అంబటి బాలేశ్​ గౌడ్, మండల అధ్యక్షుడు అరిగె కృష్ణ, నాయకులు సుభాష్​ రెడ్డి, విభీషణ్​ రెడ్డి, దూలం వెంకట్​ గౌడ్​, హబ్షీపూర్​ మాజీ ఎంపీటీసీ పుట్ట వంశీ  పాల్గొన్నారు.