- కార్యకర్తలకు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విజ్ఞప్తి
యాదాద్రి, వెలుగు: ‘‘పార్టీలో విభేదాలు లేవు. అందరం కలిసే ఉన్నాం. మీడియాలో వచ్చిన కథనాలతో ఎవరూ ఆందోళన చెందవద్దు” అని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పేర్కొన్నారు. ఈ నెల 8న ప్రధాని మోదీ వరంగల్ పర్యటనపై యాదాద్రి జిల్లా భువనగిరిలో ముఖ్య నాయకులతో గురువారం జరిగిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ గ్రాఫ్ తగ్గి, కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగినట్టుగా మీడియాలో వస్తున్న కథనాలు నమ్మవద్దని సూచించారు.
బీఆర్ఎస్‌కు బీజేపీ ఒక్కటే ప్రత్యామ్నాయమని చెప్పారు. ప్రధాని పర్యటనకు జన సమీకరణతో ఎవరెంటో తేలిపోతుందన్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి 5 వేల నుంచి 10 వేల మందిని సమీకరించాలని సూచించారు.