
గజ్వేల్, వెలుగు : అహంకారంతో దేశ ప్రధాని ఫ్లెక్సీని చింపించి, టీవీ స్ర్కీన్‌పై వస్తున్న ఆయన బొమ్మను కాలితో తన్నిన మంత్రి హరీశ్‌రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డిపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, సిద్దిపేట సీపీని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందర్రావు కోరారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు వారికి గట్టిగా బుద్ది చెబుతారన్నారు. మంగళవారం సిద్దిపేట నుంచి గజ్వేల్ కు ప్యాసింజర్ రైల్లో చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ వర్చువల్ గా సిద్దిపేట నుంచి రైల్వే సర్వీసులు ప్రారంభిస్తే మంత్రి హరీశ్‌రావు, బీఆర్ఎస్ నాయకులు వారి పార్టీ కార్యక్రమంలా వ్యవహరించడం ఎంతవరకు సమంజమన్నారు.
దేశ ప్రధాని ఫెక్సీని చింపడం, టీవీలోని ఆయన బొమ్మను తన్నడం దారుణమన్నారు. వెంటనే మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట జిల్లా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటనను పార్ల మెంట్, ప్రధాని పార్లమెంట్ ప్రి విలేజ్ కమిటీ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోవాలని కోరుతామన్నారు. ఆయన వెంటన బీజేపీ నాయకులు ధరం గురువారెడ్డి, నందన్‌గౌడ్, నలగామ శ్రీనివాస్, కప్పర ప్రసాద్‌రావు, పేర్ల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
ఆత్మాభిమానాన్ని రెచ్చగోడితే గుణపాఠం తప్పదు
దుబ్బాక, వెలుగు : దుబ్బాక నియోజకవర్గానికి మంత్రి హరీశ్‌రావు వచ్చినప్పుడల్లా ఇక్కడి ప్రాంత ప్రజల ఆత్మాభిమానాన్ని రెచ్చ గొట్టే విధానాన్ని ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో మంత్రి, ఎంపీకి గుణపాఠం తప్పదని ఎమ్మెల్యే రఘునందన్ రావు హెచ్చరించారు. మంగళవారం దుబ్బాక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దుబ్బాక ఉప ఎన్నికలో మంత్రి, ఎంపీలకు కర్రు కాల్చి వాతలు పెట్టినా మార్పు రాలేదన్నారు. రామలింగన్న నియోజకవర్గానికి సేవలు
చేశారని చెప్పే మంత్రి సోలిపేట కుటుంబానికి టిక్కెట్ ఇవ్వకుండా డబ్బున్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి ఎంతకు అమ్ముకున్నారో ప్రజలకు చెప్పాలన్నారు. పదేండ్లలో సిద్దిపేట కోమటి చెరువుకు పెట్టిన డబ్బులు, దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి పెట్టిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి హోదాలో ఉన్న హరీశ్‌రావు బీఆర్ఎస్అభ్యర్థి గెలిస్తేనే దుబ్బాక అభివృద్ధి జరుగుతుందని చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు.
2018లో పూర్తయిన ఇండ్లను ఇవ్వకుండా మంత్రి కుట్ర చేశారని, తానే స్వయంగా రంగంలోకి దిగి 2022లో పేదలకు పంపిణీ చేశానని గుర్తు చేశారు.ఉప ఎన్నికలో ప్రెస్ క్లబ్ నిర్మాణానికి ఇచ్చిన రూ. 25 లక్షల ప్రోసిడింగ్ ఎక్కడపోయిందని, జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ప్లాట్లు ఎక్కడికి పోయాయో మంత్రి సమాధానం చెప్పాలన్నారు.