దళితబంధు పథకాన్ని బీజేపీ వ్యతిరేకించలేదు

దళితబంధు పథకాన్ని బీజేపీ వ్యతిరేకించలేదు

అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చాలా అసహనంతో వ్యవహరిస్తున్నారని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు.నాపై వెటకారంగా సీఎం మాట్లాడుతున్నారన్నారు. హనుమకొండ జిల్లాలో మాట్లాడిన రఘునందన్ రావు..దళితబంధు పథకాన్ని బీజేపీ వ్యతిరేకించలేదని..స్వాగతిస్తున్నామని తెలిపారు.దళితబంధు ఆలోచన మంచిదే అని నేను మాట్లాడితే కాంగ్రెస్ వాళ్లు ట్రోల్స్ చేయడం తగదన్నారు. పథకాలు పేదలకు అందలనేది బీజేపీ ఆలోచన అని అన్నారు.

దళితులకు 3ఎకరాలు ఇస్తానని ఈరోజు చెప్పలేదు అని సీఎం కేసీఆర్ చెప్పడం సిగ్గుచేటన్నారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. మాదిగలను వర్గీకరణ చేస్తా అన్నారు.. ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. బీసీ కులాల గుర్తింపు గురించి ఒక్కసారి గెలిచిన తమిళనాడు సీఎం స్టాలిన్ వల్ల అయ్యింది.. మీ వల్ల ఎందుకు కాలేదు అని అన్నారు. మీ లాగా 80వేల పుస్తకాలు చదవలేదు.. కానీ భారత రాజ్యాంగాన్ని చదివానని అన్నారు రఘునందన్ రావు.