తెలంగాణలో మళ్లీ సెంటిమెంట్ను రగిలించి సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే అనుమానం కలుగుతోందన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. రాష్ట్రంలో అలజడి సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ బర్త్ డే సందర్భంగా బీజేపీ తరపున శుభాకాంక్షలు చెప్పిన రఘునందన్ రావు..తెలంగాణకు అనుకున్నదానికంటే అదనంగా నిధులు కేటాయించామన్నారు. ఎయిమ్స్,ఆర్టికల్చర్ యూనివర్సిటీ ఇచ్చామన్నారు. తెలంగాణ చిన్నమ్మ సుష్మాస్వరాజ్ మాటకు కట్టుబడి ఉత్తర భారతదేశానికి చెందిన ఎంపీలు ఓటు వేయడంతో పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పాస్ అయ్యిందన్నారు. కుటుంబ సౌలభ్యం కోసం బీజేపీ ఏనాడు కోరుకోలేదని..రాష్ట్రాల అభివృద్ధిని మాత్రమే కోరుకుంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం రహదారుల కోసం ఏపీకి 22 వేల కోట్లు కేటాయించిందన్నారు. కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే పాక్ ఆక్రమిత కశ్మీర్ ను ఇండియాలో కలిపేస్తామన్నారు.
మంత్రి హరీష్రావుకు రఘునందన్ సవాల్
మంత్రి హరీష్ రావు కు సవాల్ విసిరారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. తెలంగాణలోని మూడు జిల్లాలకు ఎన్ని నిధులు వెళ్లాయి..మిగతా జిల్లాలకు ఎన్ని నిధులు మంజూరు చేశారనే విషయంపై చర్చించేందుకు తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని చెప్పారు. ఇంటికి 10లక్షలు ఇచ్చినా టీఆరెస్ కు ఓట్లు పడవనే భయంతో మళ్ళీ సెంటిమెంట్ ను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ప్రచారం ఎందుకు చేసుకుంటున్నారో తెలియదన్నారు.
మరిన్ని వార్తల కోసం