
నర్సాపూర్, వెలుగు : బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అందుకు కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పని చేయాలని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. సోమవారం నర్సాపూర్‌లో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ తప్ప మిగతా నియోజకవర్గాలను పట్టించుకోలేదన్నారు.
నర్సాపూర్ నియోజకవర్గంపై సవతి తల్లి ప్రేమ చూయిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని చెప్పిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఒక బస్ డిపో ఏర్పాటు చేసి అరిగిపోయిన బస్సులను తీసుకొచ్చి డిపో ఓపెన్ చేశారని ఎద్దేవా చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి హరీశ్ రావు పెద్ద అడ్డు అని విమర్శించారు. కౌడిపల్లి కి చెందిన బీఆర్ఎస్ నాయకులు రఘునందన్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు మురళీ యాదవ్, గోపి, రాజేందర్, మల్లేశ్ గౌడ్, సురేశ్, ఆంజనేయులు గౌడ్, బాల్ రెడ్డి పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సమక్షంలో చేరికలు
దుబ్బాక: మండలంలోని బల్వంతాపూర్‌కు చెందిన 20 మంది యువకులు, మిరుదొడ్డి మండలం రుద్రారంకు చెందిన బీఆర్ఎస్నాయకులు సోమవారం
ఎమ్మెల్యే రఘునందన్‌రావు సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.