మునుగోడులో కాషాయ జెండా ఎగురవేస్తామని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ధీమా వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే రఘునందన్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసిన..గెలిచేది బీజేపీయేనని రఘునందన్ రావు అన్నారు.
నవంబర్ 3న మునుగోడుకు ఉపఎన్నిక నిర్వహించనున్నట్లుగా ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. 6వ తేదిన కౌంటింగ్ నిర్వహించనున్నట్లుగా ఈసీ వెల్లడించింది. టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి, బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలో ఉన్నారు. ఈ ఉపఎన్నిక పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.