![రాజన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే రఘునందన్](https://static.v6velugu.com/uploads/2022/02/MLA-Raghunandan-visiting-vemulawada-Mallanna-temple_icCHBqz5s4.jpg)
యాదాద్రికి ఒక న్యాయం... వేములవాడకు మరో న్యాయమా అని ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. వేములవాడ రాజ రాజేశ్వర స్వామిని రఘునందన్ రావు దర్శించుకున్నారు. స్వామివారికి కోడె మొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు చేశారు. నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేయగా.. ఈవో రమాదేవి ప్రసాదాలు అందించారు. సిరిసిల్ల జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేటీఆర్.. సిరిసిల్లకి ఎన్ని నిధులు కేటాయించారో, వేములవాడకి ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలన్నారు. వేములవాడకు లక్షలాది మంది భక్తులు వస్తున్నా.. కనీస సౌకర్యాలు కల్పించటం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
For More News..