ప్రస్తుతం ఇండియా వైడ్ ఎక్కడ చూసినా కల్కి 2898 ఏడీ గురించే చర్చ నడుస్తోంది. నేడు(జూన్ 27) విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్ కూడా పాజిటీవ్ టాక్ రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. టపాసులు పేలుస్తూ, తీన్మార్ డాన్సులు చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇక ప్రభాస్ సినిమా అంటే భీమవరంలో జరిగే సంబరాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జూన్ 27 తెల్లవారుజాము నుండే అక్కడ పండుగ వాతావరం నెలకొంది.
సినిమాకు ఓవరాల్ గా సూపర్ హిట్ టాక్ రావడంతో సక్సెస్ సెలెబ్రేషన్స్ కూడా చేశారు ప్రభాస్ ఫ్యాన్స్. అయితే.. కల్కి సక్సెస్ సెలెబ్రేషన్స్ లో ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు కూడా పాల్గొన్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ తో కలిసి థియేటర్ వద్ద కేక్ కట్ చేశారు. అనంతరం అభిమానులతో కలిసి సినిమా చూసి సందడి చేసారు. ఈ సంధర్బంగా రఘురామ కృష్ణరాజు మాట్లాడుతూ.. కల్కి సినిమా హడావిడి ఇక్కడితో ఆగదు. కల్కి 2 కూడా రాబోతోంది. మన ఊరు హీరో ప్రభాస్ తో నిర్మాత అశ్వినీదత్ గారు భారీ సినిమా చేశారు. ఈ సినిమాతో ప్రభాస్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం. కల్కి 2 కోసం ఇప్పటినుండే ఎదురుచూద్దాం.. అంటూ చెప్పుకొచ్చారు రఘురామ కృష్ణరాజు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ వీడియోలు వైరల్ గా మారుతన్నాయి.