కరీంనగర్: ‘ మా బామ్మర్థులు ఒవైసీలు అడ్డగోలుగా మాట్లాడుతున్నరు. వాళ్లు మానసిక రోగంతో బాధపడుతున్నరు. వాళ్లను మెంటల్ ఆస్పత్రిలో చేర్చాలి. 15 నిమిషాలు టైమిస్తే హిందువులను నరికి చంపుతామంటున్నారు. దేశంలో బీజేపీ అధికారంలోకి రావడం పక్కా. బీజేపీ అధికారంలోకి రాంగనే ఒవైసీ బామ్మర్థులను యాడికి పంపిస్తమో మీరే చూస్తరు’ అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఇవాళ కరీంనగర్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కు మద్దుతుగా నిర్వహించిన బైక్‌ర్యాలీలో ఆయన మాట్లాడారు.
సంజయ్‌ను గెలిపించాలని కోరారు. లిక్కర్ దందా చేసిన కవితను జైలుకు పంపినందుకు బండి సంజయ్ గలీజోడైండా అంటూ కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు. ‘కేటీఆర్.. నువ్వొక నాస్తిడివి. నీకు శ్రీరాం గురించి ఏం తెలుసు? నీకు ముస్లిం ఓట్లే కావాలా?... హిందువుల ఓట్లు వద్దా? గతంలో మీ అయ్య హిందుగాళ్లు.. బొందుగాళ్లంటే.. సంజయన్న ఏం చేసిండో నీకు తెలుసా?’ అంటూ నిలదీశారు. ఈ ఎన్నికలు ప్రధానిని ఎవరిని చేయాలో జరిగే ఎన్నికలన్నారు. రాహుల్ పప్పును ప్రధానిని చేయగలమా అని ప్రశ్నించారు.
రాహుల్ గెలిచినా ఓకే, కానీ మోదీ గెలిచి పీఎం కాకూడని పాకిస్తాన్ మంత్రి అన్నాడన్నారు. ముస్లిం జనాభా 43 శాతం పెరిగితే, హిందువుల జనాభా 8 శాతం తగ్గిందన్నారు. భారత్ ను ఇస్లామిక్ దేశంగా మార్చడానికి కాంగ్రెస్ కూటమి పార్టీలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. మోదీ అధికారంలోకి వస్తే అందరికీ ఒకటే విధానం తీసుకురాబోతున్నారన్నారు.