ఆలయాల అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి

ఆలయాల అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి
  • ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ

హైదరాబాద్, వెలుగు: ఏపీలోని పురాతన దేవాలయాలను వివిధ  మతాలకు చెందిన వారు ఆక్రమించు కుంటున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఏపీ చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు.

ఏపీలోని అన్ని ప్రముఖ హిందూ దేవాలయాల్లో కార్యకలాపాల పర్యవేక్షణ, నియంత్రణకు ఓ రెగ్యులేటరీ కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. హిందూ మతానికి చెందిన వ్యక్తులు, సంఘాలకు మాత్రమే ఆలయ ప్రాంగణంలో వ్యాపారం,  ఇతర కార్యకలాపాలను నిర్వహించడాని కి కమిటీ అనుమతివ్వాలన్నారు.  అన్యమతస్తుల వ్యాపార కార్యకలా పాలపై నిషేధం విధించాలన్నారు.