![సాక్ష్యాల్లేవు.. కేసు కొట్టేయండి](https://static.v6velugu.com/uploads/2025/02/mla-raja-singh-seeks-quashing-of-2021-dharna-case-in-high-court_z1csSJGHub.jpg)
- 2021లో ధర్నా కేసులో కోర్టును కోరిన రాజాసింగ్
హైదరాబాద్, వెలుగు: జీహెచ్‌ఎంసీ ఆఫీసు ముందు ధర్నాకు సంబంధిం చి 2021లో తమపై నమోదైన కేసు ను కొట్టేయాలంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ సహా 20 మంది హైకోర్టు ను ఆశ్రయించారు. శుక్రవారం జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. నాలాలపై అక్రమ నిర్మాణాలు తొలగించాలని బీజేపీ నేతలు జీహెచ్‌ఎంసీ ముందు నిరసన వ్యక్తం చేశారన్నారు.
అయితే, కరోనా నిబంధనలు ఉల్లంఘించారంటూ సైఫాబాద్ ఎస్ఐ ఎం.తాజం రెడ్డి కేసు పెట్టారని ఆరోపించారు. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేవని, కేసు కొట్టేయాలని కోరారు. వాదనలు విన్న జడ్జి..విచార ణను ఈ నెల 21కి వాయిదా వేశారు.