
గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపే లక్ష్యంగా సోషల్ మీడియా కో ఆర్డినేటర్లు పనిచేయాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ పిలుపునిచ్చారు. శుక్రవారం గోదావరిఖనిలో పార్లమెంట్ ఎన్నికల కమిటీ ఆధ్వర్యంలో చీఫ్ క్లస్టర్లు, ప్రత్యేక ఆహ్వానితులు, జోనల్ క్లస్టర్లు, డివిజన్ అధ్యక్షులు, డివిజన్ సోషల్ మీడియా కో ఆర్డినేటర్లు, సోషల్ మీడియా క్లస్టర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం అనుసరించాల్సిన విధివిధానాలను వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తన గెలుపు కోసం ఏ విధంగా పనిచేశారో అంతకుమించి పనిచేసి వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.