భువనగిరిని అభివృద్ధి చేసే బాధ్యత నాదే: రాజగోపాల్ రెడ్డి

యాదాద్రి భువనగిరి: గత 5 నేలలుగా రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నా కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.  భువనగిరి  ప్రజలు కొన్ని ఏండ్లుగా కాలుష్యం, ఉద్యోగాలు లేకుండా అనేక సమస్యలతో  బాధ పడ్డారన్నారు. తాను  ప్రజలకు మాటిస్తున్నానని..  భువనగిరి పార్లమెంట్ ను అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. మే 9వ తేదీ గురువారం చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో మున్సిపాలిటీ అధ్యక్షుడు ముత్యాల ప్రభాకర్ రెడ్డితో సహా పలువురు బీఆర్ఎస్ నాయకులు.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు.

ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. 14 పార్లమెంట్ స్థానాలను ప్రజలు గెలిపిస్తే రాష్ట్రం  అభివృద్ధి , సంక్షేమలో ఉంటుందన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉనికిని కోల్పోయిందన్నారు.బీఆర్ఎస్  మొత్తం అవినీతిలో మునిగిపోయిందని.. కాబట్టే ఆ పార్టీకి ఈ దుస్థితి వచ్చిందన్నారు.  కాంగ్రెస్ అధిష్టానం తనపై నమ్మకంతో భువనగిరి పార్లమెంట్ స్థానాన్ని తన చేతుల్లో పెట్టిందని చెప్పారు.  చామల కిరణ్ కుమార్ రెడ్డి గత ఎన్నో ఏండ్లుగా కాంగ్రెస్ లో పని చేస్తున్నారన్నారు. 

"బీఆర్ఎస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా.. మీరు కాంగ్రెస్ లో చేరండి, కాంగ్రెస్ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అవ్తుంది" అని రాజగోపాల్ రెడ్డి అన్నారు.  చౌటుప్పల్ మున్సిపాలిటీలో అనేక సమస్యలు  ఉన్నాయని...వాటన్నిటినీ త్వరగా ప్రభుత్వంతో మాట్లాడి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తానని ఆయన చెప్పారు. రేపు ఏఐసీసీ చీప్  మల్లికార్జున ఖర్గే బహిరంగ సభ నకేరికల్ లో ఉంటుందని. అధిక సంఖ్యలో స్వచ్ఛందంగా హాజరై సభను విజయవంతం చేయాలని  ఆయన కోరారు.