
అర్హులైన ప్రతీ ఒక్కరికి ప్రభుత్వం రేషన్ కార్డులు ఇస్తుందన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి. చండూర్ మున్సిపాలిటీలో సన్న బియ్యం పంపిణి కార్యాక్రమాన్ని ప్రారంభించారు రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అనడానికి రుజువు నిరు పేదలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమమే అని అన్నారు.
గతంలో దొడ్డు బియ్యం ఇచ్చేవారు.. అవి తినడానికి కొంత ఇబ్బందిగా ఉండేది. ఆ ఇబ్బందిని గుర్తించి ఇప్పుడు ప్రజా ప్రభుత్వం నిరుపేదలకు సన్న బియ్యం పంపిణీ చేస్తుంది. రాబోయే కాలంలో ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తాం. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక నిరుపేదలకు ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రజా ప్రభుత్వం రేషన్ కార్డులు ఇస్తుంది. సన్న బియ్యంతో పాటు నిత్యవసర సరుకులు కూడా అందిస్తాం. ఇల్లీగల్ బెల్ట్ షాపుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాం. నకిలీ మద్యం తయారీ విషయంలో ఎంతటి వారినైనా వదిలి పెట్టేది లేదు. ఇల్లీగల్ కార్యకలాపాలు నిర్వహించే వారిపై కఠినంగా వ్యవహరిస్తాం అని రాజగోపాల్ రెడ్డి అన్నారు