ప్రతిఒక్కరికీ ఉచిత కంటి పరీక్షలు చేయిస్తా : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 

ప్రతిఒక్కరికీ ఉచిత కంటి పరీక్షలు చేయిస్తా : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 

మునుగోడు, వెలుగు : నియోజకవర్గంలో కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రతిఒక్కరికీ ఉచిత కంటి పరీక్షలు చేయిస్తున్నానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తల్లి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కు చెందిన శంకరా కంటి ఆస్పత్రి, ఫీనిక్స్ ఫౌండేషన్ సౌజన్యంతో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆదివారం ఆయన సతీమణి లక్ష్మీరాజగోపాల్ తో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కంటి వైద్య శిబిరాలకు అపూర్వ స్పందన వస్తోందన్నారు. ఇప్పటివరకు నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాల్లో 324 మందికి కంటి ఆపరేషన్ చేశామని, మరో 152 మంది ఆపరేషన్​కు ఎంపికయ్యారని తెలిపారు. ఆపరేషన్లకు ఎంపికైనవారిలో 110 మంది పేషెంట్లను హైదరాబాద్ కు తీసుకెళ్తామని, ఆపరేషన్​ అనంతరం తిరిగి ఇంటికి పంపిస్తామని వివరించారు. అనంతరం ఉచిత వైద్య కంటి పరీక్షలు చేయించుకోవడానికి వచ్చిన మహిళలు, వృద్ధులను ఆయన ఆప్యాయంగా పలకరించి మీకు.. నేను ఉన్నానని భరోసా ఇచ్చారు.