వద్దన్నా బీఆర్ఎస్ నాయకులు.. నా వెంట తిరుగుతున్నరు : రాజగోపాల్ రెడ్డి

మునుగోడులో  వద్దన్నా..  బీఆర్ఎస్ నాయకులు  తన  దగ్గరికి వస్తున్నారని చెప్పారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి.   జేబులో కాంగ్రెస్ కండువాలు పెట్టుకొని తిరుగుతున్నారు...నేను కప్పకపోయిన వాళ్ళే కప్పుకునేలా  ఉన్నారని అన్నారు.  కాంగ్రెస్ లోకి ఫైళ్ల శేఖర్ వస్తా అన్నారు... మళ్ళీ ఎంపీ టికెట్ ఎవ్వకపోయే సరికి జగదీష్ రెడ్డి దగ్గరికి పోయారనన్నారు. తెలంగాణలో బీజేపీ గెలవదు..  బూర కేవలం  కులం పేరుతో రాజకీయం  చేస్తారని విమర్శించారు. రాజకీయం పార్టీ కోసం పని చేయాలి కానీ కులం కోసం కాదన్నారు. 

భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ కేంద్రంలో భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి   చామల కిరణ్ కుమార్ రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే  రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఈ సందర్బంగా మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి..  చామల కిరణ్  చదువుకున్న వ్యక్తని...20 యేండ్లు యూత్ కాంగ్రెస్ లో పని చేశారని చెప్పారు.  భిమనపళ్లి చెరువు నింపడానికి 2012 లో  తన డబ్బు ఖర్చు చేశానని తెలిపారు. గోదావరి జలాలను బస్వాపూర్ ప్రాజెక్ట్  ద్వారా తీసుకువచ్చే  దాకా తాను నిద్ర పోనని చెప్పారు.  పోచంపల్లి మండలంలో ప్రతి ఎకరాకు సాగు నీరు అందించే బాద్యత తనదేనన్నారు. 

నల్గొండ జిల్లాలో తాము పంచ పాండవులం ( కోమటి రెడ్డి బ్రదర్స్, కుంభం, ఐలయ్య, చామల) ఉన్నాం.. బీఆర్ఎస్ ఏమో గ్యారెజ్ కు పోయిందన్నారు. కవిత జైలుకు పోయిందని.. కేసీఆర్,  కేటీఆర్ కూడా పోతారని చెప్పారు.