గ్రామాల్లో బెల్ట్ షాపులు మూసి వేయించే బాధ్యత మహిళలు తీసుకోవాలన్నారు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు, వీధి వ్యాపారులకు రుణాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. మహిళా శక్తి భవనం వెయ్యి గజాల్లో కట్టిస్తానని చెప్పారు. గ్రామాల్లో బెల్ట్ షాపులను మూసివేయించే బాధ్యత మహిళలే తీసుకోవాలి. మహిళా శక్తి అంటే చూపించాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల్లో మహిళలే ముందున్నారని చెప్పారు రాజగోపాల్ రెడ్డి.
Also Read :- హైడ్రా మరో కీలక నిర్ణయం.. 2025 జనవరి నుంచి అమలు
మహిళలను కోటీశ్వరులను చేసే వరకు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్నారు రాజగోపాల్ రెడ్డి. కుటుంబంలో బలంగా ఉంటే ఆ కుటుంబం మొత్తంబాగుంటుందన్నారు. మహిళలకు నెలకు 2500 ఇచ్చే హామీపై కట్టుబడి ఉన్నామని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం వల్ల కొంత ఆలస్యం అవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ..ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని తెలిపారు. తాము పదేళ్లు ఓపికపట్టాం.. కానీ బీఆర్ఎస్ నాయకులు ఒక్క సంవత్సరానికే ఎగిరెగిరి పడుతున్నారని విమర్శించారు. అధికారం కోల్పోయి మతి భ్రమించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మహిళలకు ఇచ్చిన హామీలన్నీ నెరువేరుస్తామన్నారు.