పదేండ్లు పాలించిన బీఆర్ఎస్ ఐదు నెలల్లో కుప్పకూలిందన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో దోచుకున్న లీడర్లు ఎవరూ శిక్ష తప్పించుకోలేరన్నారు. బీఆర్ఎస్ లీడర్లు కాంగ్రెస్ లోకి వస్తా అంటే వద్దనకుండా.. చేర్చుకోవాలని సూచించారు. చౌటుప్పల్ బూత్ లెవల్ విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ప్రభుత్వాన్ని కూల్చాలని బీఆర్ఎస్ పదే పదె చెప్పింది కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టే లేకుండా పోతుందన్నారు. తెలంగాణను పాలించే హక్కు ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉందన్నారు.
భువనగిరి పార్లమెంట్ గెలిపించి తెస్తానని సీఎం రేవంత్ రెడ్డి కి మాటిచ్చానని చెప్పారు రాజగోపాల్ రెడ్డి. కార్యకర్తలు అహర్నిశలు కష్టపడాలని సూచించారు. పైన పైన తిరిగే లీడర్లు పార్టీకి అవసరం లేదు. నిజంగా కష్టపడే లీడర్ కే స్థానం కల్పిస్తామని తెలిపారు. అభివృద్ధి పేరు మీద ఓట్లు అడగాలి కానీ డబ్బుతో కాదన్నారు.
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు కట్టుబడి ఉందన్నారు. కార్యకర్తల కష్టంతోనే తాను ఎమ్మెల్యేగా గెలిచానని తెలిపారు.