స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య కాసేపు స్పోట్స్మెన్గా మారారు. చిన్న పిల్లలతో కలిసి ఆయన కోకో, కబడ్డీ, వాలీబాల్ ఆటలు ఆడారు. అంతేకాకుండా తీన్మార్ స్టెప్పులు కూడా వేశారు. జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్ డివిజన్లో రెండు కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే రాజయ్య శంకుస్థాపన చేశారు. అనంతరం స్టేషన్ ఘన్పూర్ రైల్వే గేట్ సమీపంలో క్రీడాప్రాంగణాన్ని ప్రారంభించారు.
అక్కడ ఆయన చిన్నపిల్లలతో కలిసిపోయి సరదాగా కాసేపు కబడ్డీ, వాలిబాల్, కోకో ఆటలను ఆడారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి మహిళలతో కలిసి తీన్మార్ స్టెప్పులు వేశారు. సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, ప్రజలను ఆదుకుంటున్నారని ఈ సందర్బంగా రాజయ్య అన్నారు. దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని చెప్పారు.