స్టేషన్ ​ఘన్పూర్ టికెట్ నాదే.. గెలుపు నాదే : ఎమ్మెల్యే రాజయ్య

స్టేషన్ ​ఘన్పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య  సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున తానే మళ్లీ పోటీ చేయనున్నట్లుగా తెలిపారు. అంతేకాకుండా అధిష్టానం కూడా  తనకే టికెట్ ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు. స్టేషన్​ ఘన్పూర్ డివిజన్​ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాజయ్య మాట్లాడారు. ఎన్నికల ముందు టికెట్ల విషయంలో ఎన్ని రూమర్లు వచ్చినా భయపడేది లేదని,  కార్యకర్తలు కూడా  పట్టించుకోవద్దని సూచించారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ కు, పదవికి  రాజీనామా చేసి వచ్చానని రాజయ్య  చెప్పారు.  తనతో కలిసి రాజీనామా చేసిన వారు ఎవరూ కూడా ఇప్పుడు బీఆర్​ఎస్​లో లేరని అన్నారు.  సీఎం కేసీఆర్​కు తాను మొదటి నుంచి విధేయుడిగా ఉన్నానని,  పార్టీ అధినేతగా సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్న తాను  కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.  

మరో ఆరు నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయని రాజయ్య అన్నారు.  ఈ సారి స్టేషన్​ ఘన్పూర్  టిక్కెట్​ తనదేనని ధీమా వ్యక్తం చేశారు. సోషల్​ మీడియాలో వస్తున్న కథనాలను పట్టించుకోవద్దని క్యాడర్​కు సూచించారు. కాగా సిట్టింగ్​లకు టికెట్ ఇస్తానని  ఇటీవల సీఎం కేసీఆర్​ మాట్లాడిన నేపథ్యంలో రాజయ్య ఈ కామెంట్స్​ చేశారని తెలుస్తోంది.