జనగామ జిల్లా: స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య కంటతడి పెట్టారు. స్టేషన్ ఘన్ పూర్లో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న రాజయ్య నాయకులు, కార్యకర్తల మాటలతో పలుమార్లు భావోద్వేగానికి లోనయ్యారు.
మీ అభిమానానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానంటూ రాజయ్య కంటతడి పెట్టుకున్నారు. ప్రతి ఒక్కరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటానని చెప్పారు. రాజయ్యకు మనం ఇచ్చే మర్యాద ఇదేనంటూ శ్రీపతిపల్లికి చెందిన కేశిరెడ్డి మనోజ్, రాజయ్యకు పాదాభివందనం చేయగా.. సభావేదికపై ఉన్న ఎమ్మెల్యే రాజయ్య మరోసారి భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. దీంతో కార్యకర్తలు సైతం కన్నీరు పెట్టారు.