హైదరాబాద్, వెలుగు: దళిత బంధులో అవినీతికి అడ్డుకట్ట వేయడానికి వెంటనే టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేయాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఈ స్కీమ్‌లో కమీషన్లకు కత్తెర వేసేందుకు కేసీఆర్ నిఘా పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
స్వయాన అధికారులే ఈ స్కీమ్‌లో అవినీతికి పాల్పడుతున్నారని సోమవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. దళిత బం ధును బీఆర్ఎస్ సర్కార్ కేవలం ఎన్నికల ప్రచారం కోసమే వాడుకుంటున్నదన్నారు. దళిత సోదరులకు ఆర్థిక న్యాయం జరగాలని కోరుకుంటున్నామని అన్నారు.