గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చూపిస్తామని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. ఆయన శనివారం అత్తాపూర్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి సంగీత తరపున డివిజన్‌లో ప్రచారం నిర్వహించారు. ఆ రోడ్ షోలో బీజేపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ప్రజల అభివృద్ధిని మరిచాయని ఆయన ఎద్దేవా చేశారు.
‘గడిచిన 6 ఏళ్లలో టీఆర్ఎస్ మాటలే చెప్పింది తప్ప.. ఏ హామీలు నెరవేర్చలేదు. బీజేపీ కార్యకర్తలను, కాండిడేట్లను టీఆర్ఎస్ నేతలు బెదిరిస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ఓట్ల కోసం టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు హిందూ,ముస్లింల మధ్య చిచ్చుపెడుతున్నారు. జీహెచ్ఎంసీలో రిలీజ్ చేసిన కోట్ల రూపాయలు టీఆర్ఎస్, ఎంఐఎం నాయకులు వాళ్ల జేబుల్లోనే వేసుకున్నారు. కేసీఆర్ తన కుటుంబ పాలనతో హైద్రాబాద్‌ను వారి కమీషన్‌కి అడ్డాగా మార్చుకున్నారు. కరెంట్ బిల్, వాటర్ బిల్, టాక్స్ కడుతున్న ప్రజల కోసం ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి చెయ్యట్లేదు’ అని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు.
For More News..