మైనర్ బాలిక కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు . మే 28న బాధితురాలు ఫిర్యాదు చేస్తే పోలీసులు మే 31న FIR నమోదు చేశారని చెప్పారు. రాజకీయ ప్రముఖుల కొడుకులు ఉండటంతో కేసును పక్కదారి పట్టించి.. అసలు నిందితులను తప్పించే ప్రయత్నం జరుగుతోందని రాజాసింగ్ ఆరోపించారు. లక్షలు పెట్టి ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నిందితుల విజువల్స్ రికార్డ్ కాలేదా అని ప్రశ్నించారు. అసలు నిందితుల్లో ఒక్కరిని కూడా వదలకుండా అందరి అరెస్ట్ చేయాలన్నారు.
మైనర్ కేసులో ప్రాథమిక ఆధారాలు దొరికినా.. పోలీసులు నిందితులను అరెస్ట్ చేయలేదని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ విమర్శించారు . సీఎం కేసీఆర్, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ క్లియరెన్స్ కోసం ఎదురుచూస్తున్నారా అని పోలీసులను ప్రశ్నించారు. మైనర్ ఘటనలో ఎంఐఎం లీడర్ల కొడుకులు ఉన్నట్లు తెలుస్తోందన్నారు. అసలు దోషులను తప్పించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించిన ఆయన బాధితురాలి తరఫున పోరాడుతామన్నారు. అసలు నిందితులను వెంటనే అరెస్ట్ చేయకపోతే వీఐపీ కల్చర్ ను ప్రమోట్ చేసినట్లు అవుతుందని కృష్ణసాగర్ అభిప్రాయపడ్డారు.
మరిన్ని వార్తల కోసం..
మైనర్ బాలిక కేసులో సంచలన వాస్తవాలు..!
కర్నాటక బస్సు ప్రమాద బాధితులకు ఎక్స్ గ్రేషియా