ఒవైసీ కాలేజీని కూల్చితే రేవంత్ హీరో: ఎమ్మెల్యే రాజాసింగ్

ఒవైసీ కాలేజీని కూల్చితే రేవంత్ హీరో: ఎమ్మెల్యే రాజాసింగ్

ఎంపీ అసదుద్దీ న్ ఒవైసీకి చెందిన ఫాతిమా కాలేజీని ఎప్పుడు కూలుస్తారో సీఎం రేవంత్, హైడ్రా కమిషనర్ తేదీ ప్రకటించాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు.

 ఒవైసీ కాలేజీని కూల్చకపోతే హైడ్రా విఫలమైనట్లేనన్నారు. దాన్ని కూల్చితే సీఎం రేవంత్ హీరో అవుతారని చెప్పారు. చాంద్రాయ ణగుట్టలోని సలకం చెరువును కబ్జా చేసి ఫాతిమా కాలేజీ కట్టా రనే ఫిర్యాదులు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో కాలేజీకి హైడ్రా నోటీసులు పంపింది.

ALSO READ | HYDRA : నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చివేయం..కొత్త నిర్మాణాలను మాత్రమే కూలుస్తాం