హైదరాబాద్: ‘కేటీఆర్.. జైలుకెళ్లేందుకు సిద్దంగా ఉండండి.. ఖర్మ ఎవరినీ వదిలిపెట్టదు.. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు నాపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశాయి..’ అంటూ ట్వీట్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. జైలు కెళ్లే మీకు కొన్ని సూచనలు చేస్తున్నానని పేర్కొన్నారు. 4 జతల డ్రెస్ లు, ఒక టవల్, ఒక బ్లాంకెట్, హ్యాండ్ కర్చీఫ్, సోప్, ఒక ప్యాకెట్ ఆవకాయ, చలి కాలం కాబట్టి వెచ్చని స్వెటర్ తప్పనిసరి దగ్గర పెట్టుకోవాలని సూచించారు. అధికారం ఉందని ఎది పడితే అది చేస్తే తిరిగి ఖర్మ రూపంలో మనం అనుభవించాల్సి వస్తుందని పేర్కొన్నారు.
ALSO READ | ఫార్ములా ఈ రేసు కేస్: ముగిసిన కేటీఆర్ ఈడీ విచారణ