కందనూలు, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా పాలనలో భాగంగా విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి అన్నారు. గురువారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన రైతులకు స్పింక్లర్స్ ను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ .. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో 31 వేల కోట్ల రైతుల రుణాలను మాఫీ చేశారన్నారు.
రైతులు స్పింక్లర్లను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని కోరారు. ప్రతి రైతుకు లబ్ధి చేకూర్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా హార్టికల్చర్ అధికారి జగన్, వీరేందర్, నగేశ్, రైతులు పాల్గొన్నారు.